Andhra Pradesh: ఏపీలో రేపు కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ శాఖ

Heat wave warning for AP

  • ఏపీలో పెరుగుతున్న ఎండలు
  • పలు ప్రాంతాల్లో వడగాడ్పులు
  • తాజా బులెటిన్ విడుదల చేసిన విపత్తుల శాఖ

ఏపీలో పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని కొన్నిచోట్ల రేపు (బుధవారం) కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో పేర్కొంది. విజయనగరం జిల్లా కొమరాడ, కురుపాం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. మరో 13 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. 

గుంటూరు జిల్లాలో 14 మండలాలు, కృష్ణా జిల్లాలో 9 మండలాలు, కర్నూలు జిల్లాలో 9 మండలాలు, కడప జిల్లాలో 8 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 5 మండలాలు, తూర్పు గోదావరి జిల్లాలో 1 మండలం వడగాడ్పులకు గురవుతాయని వివరించింది.

Andhra Pradesh
Heat Wave
Districts
Disaster Management
  • Loading...

More Telugu News