Sai tej: సెట్స్ పైకి వెళ్లిన సాయితేజ్ .. గుడ్ లక్ చెప్పిన వరుణ్ తేజ్!

Saitej new movie update

  • కొంతకాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం 
  •  పూర్తిగా కోలుకున్న సాయితేజ్
  •  తాజా చిత్రం కోసం సెట్స్  పైకి
  • దర్శకుడిగా కార్తీక్ దండు

కెరియర్ తొలినాళ్లలోనే సాయితేజ్ మాస్ హీరోగా మార్కులు కొట్టేశాడు. డైలాగ్ డెలివరీలోను .. డాన్సుల్లోను కొంతవరకూ చిరంజీవిని అనుకరిస్తూ ఆకట్టుకున్నాడు. 'రిపబ్లిక్' సినిమా విడుదలకి సిద్ధమైన సమయంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చాలా రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండవలసి వచ్చింది. 

సాయితేజ్ ఎప్పుడు పూర్తిగా కోలుకుని సెట్స్ పైకి వెళతాడా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తాజా చిత్రం కోసం సాయితేజ్ సెట్స్ పైకి వెళ్లాడు. చాలా గ్యాప్ తరువాత ఆయన మళ్లీ కెమెరా ముందుకు వెళ్లాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సందర్భంగా వరుణ్ తేజ్  ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. " మళ్లీ నువ్వు సెట్స్ పైకి రావడమనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది బావా. లవ్ యూ  .. మోర్ పవర్ .. గుడ్ లక్" అంటూ సాయితేజ్ లో మనో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. కెరియర్ పరంగా సాయితేజ్ కి ఇది 15వ సినిమా. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Sai tej
Varun Tej
Karthik Dandu
  • Loading...

More Telugu News