TDP: హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబు, మంగ‌ళ‌గిరిలో లోకేశ్‌.. టీడీపీ 40 వ‌సంతాల వేడుక ప్రారంభం

tdpformatikon day celebrations starts
  • ఆద‌ర్శ న‌గ‌ర్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో చంద్ర‌బాబు
  • ఎన్టీఆర్ పార్టీని ప్ర‌కటించిన ప్రాంతంలోనే వేడుక‌ల‌కు శ్రీకారం
  • చంద్ర‌బాబు వెంట అచ్చెన్న‌, బ‌క్క‌ని
  • మంగ‌ళ‌గిరిలో బైక్ ర్యాలీలో నారా లోకేశ్
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) 40 వ‌సంతాల వేడుక‌లు మంగ‌ళ‌వారం సాయంత్రం 4గంట‌ల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభ‌మ‌య్యాయి. హైద‌రాబాద్‌లోని ఆద‌ర్శ న‌గ‌ర్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో నాడు ఎన్టీఆర్ పార్టీ పేరును ప్ర‌క‌టించిన చోటుకు వెళ్లిన పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు వేడుక‌ల‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. చంద్ర‌బాబు వెంట రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్య‌క్షులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, బ‌క్క‌ని న‌ర్సింహులుతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు త‌ర‌లివెళ్లాయి.

ఇక పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మంగ‌ళ‌గిరిలో పార్టీ 40 ఏళ్ల పండుగ వేడుక‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు నిర్వ‌హించిన బైక్ ర్యాలీలో లోకేశ్ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ40 వ‌సంతాల వేడుక‌ల‌ను రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు విదేశాల్లోనూ టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా జ‌రుపుకుంటున్నాయి.
TDP
TDP Formation Day
Chandrababu
Nara Lokesh
Atchannaidu
Bakkani Narsimhulu

More Telugu News