Kodali Nani: టీడీపీకి ఎన్టీఆర్ శాపం తగిలింది... చంద్రబాబుకు కూడా తగులుతుంది: మంత్రి కొడాలి నాని

Kodali Nani fires on TDP

  • 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న టీడీపీ
  • ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారన్న నాని 
  • ఎన్టీఆర్ శాపం తగిలి లోకేశ్ ఓడిపోయాడని వ్యాఖ్య  

టీడీపీ 40 వసంతాల ప్రస్థానం నేపథ్యంలో ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. టీడీపీకి ఎన్టీఆర్ శాపం తగిలి పతనమై పోయిందని, గత ఎన్నికల్లో అది స్పష్టమైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీపై పగ తీర్చుకోవడం ఖాయమని అన్నారు. 

ఎన్టీఆర్ ను మోసం చేసిన చంద్రబాబును ఏమనాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కూడా శాపం తప్పకుండా తగులుతుందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ శాపం తగిలే నారా లోకేశ్ మంగళగిరిలో ఓడిపోయాడని తెలిపారు.  చంద్రబాబు వయసు 73 ఏళ్లని, సరిగ్గా నిలుచోలేని, కూర్చోలేని వ్యక్తి టీడీపీని పరుగులు తీయిస్తాడా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"వెన్నుపోటు పొడిచేదీ మీరే... పార్టీని లాక్కునేదీ మీరే... మళ్లీ ఎన్టీఆర్ ఫొటోలకు దండలు వేసేదీ మీరే" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు, ఎన్టీఆర్ ను పార్టీ నుంచి ఎందుకు పంపారో చెప్పాలని కొడాలి నాని నిలదీశారు.

Kodali Nani
TDP
Chandrababu
Nara Lokesh
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News