USA: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంచుతో రోడ్డు కనిపించక 60 వాహనాలు ఢీ.. ఇదిగో వీడియో

50 to 60 vehicles piled up as accident involved in near zero visibility due to Snow

  • ముగ్గురి మృతి.. పలువురికి గాయాలు
  • పెన్సిల్వేనియా స్టేట్ లోని హైవేపై ఘటన
  • నెల రోజుల్లో రెండో ప్రమాదం

మామూలుగా కురిసే మంచుతోనే రోడ్ల మీద ప్రయాణాలు చేయడం చాలా కష్టం. అలాంటిది మంచుతో పూర్తిగా నిండిపోయిన రోడ్లమీద ప్రయాణం చేయడమంటే..  దట్టంగా కురిసే ఆ మంచుతో కనీసం ముందు ఏముందో కూడా కనిపించని స్థితిలో డ్రైవింగ్ అంటే మరింత ప్రమాదకరం. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర జాతీయ రహదారిపై అలాంటి ప్రమాదమే జరిగింది. 

ఒకదానినొకటి 60 దాకా వాహనాలు ఢీకొట్టుకున్నాయి. తీవ్రమైన మంచు కారణంగా అప్పటికే చాలా వాహనాలు ప్రమాదానికి గురై రోడ్డుపై నిలిచిపోయాయి. అయితే, వెనకనుంచి వస్తున్న వాహనాలు వాటిని గమనించకపోవడంతో వేగంగా వచ్చి ఢీకొట్టేశాయి. 

ట్రాక్టర్లు, కార్లు, ట్రక్కులు సహా 50 నుంచి 60 వాహనాలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. ప్రమాదం అనంతరం కొన్ని కార్లకు మంటలు అంటుకున్నాయి. ఘటనలో ముగ్గురు చనిపోగా..  చాలా మంది గాయపడ్డారు. కొన్ని కిలోమీటర్ల పాటు హైవేపై ట్రాఫిక్ జాం అయింది. 

మంచు చాలా తీవ్రంగా కురుస్తుండడంతో సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యం జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మిస్ అయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కాగా, నెలరోజుల్లో ఇంత పెద్ద మంచు ప్రమాదం జరగడం ఇది రెండోసారి. అంతకు ముందు నెల క్రితం షూల్ కిల్ కౌంటీలో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News