Nani: అందాల నజ్రియా అంకితభావం అలాంటిది మరి!

Ante Sundaraniki movie update

  • యూత్ లో నజ్రియాకి విపరీతమైన క్రేజ్
  • 'అంటే .. సుందరానికీ'తో టాలీవుడ్ ఎంట్రీ
  • నాని సరసన కనిపించనున్న నజ్రియా 
  • జూన్ 10వ తేదీన విడుదల    

తమిళ .. మలయాళ భాషల్లో నజ్రియాకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. కొంతకాలం పాటు ఆమె అక్కడి కుర్రకారుకు కునుకులేకుండా చేసింది. ఆ సినిమాల అనువాదాలు చూసిన ఇక్కడి కుర్రాళ్లు కూడా పొలోమంటూ మనసులు పారేసుకున్నారు. కళ్లతో ఆమె చేసే విన్యాసాలు చూడటానికి పోటీపడేవారు. 

అయితే అక్కడ వరుస సినిమాలతో ఆమె బిజీగా ఉండటం వలన తెలుగులో ఇంతవరకూ చేయలేకపోయింది. తాజాగా నాని జోడీగా 'అంటే .. సుందరానికీ!' సినిమాతో పరిచయమవుతోంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం నజ్రియా తెలుగు నేర్చుకోవడం .. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పడం విశేషం.

"ఈ సినిమాలో నా పాత్రకి డబ్బింగ్ పూర్తి చేశాను. ఈ సినిమాను ఒక అద్భుతమైన వ్యక్తి రూపొందించాడు. తను ఇప్పుడు నాకు మంచి స్నేహితుడు కూడా" అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, నదియా ఒక కీలకమైన పాత్రను పోషించింది. జూన్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Nani
Nazriya
Vivek Atreya
Ante Sundaraniki Movie
  • Loading...

More Telugu News