Mahesh Babu: మహేశ్ తో రాజమౌళి సినిమా బడ్జెట్ అన్ని వందల కోట్లా!

Mahesh Babu and Rajamoui project update

  • 'ఆర్ ఆర్ ఆర్'తో సంచలన విజయం 
  • 3 రోజుల్లోనే 500 కోట్లకి పైగా వసూళ్లు 
  • మహేశ్ తో సినిమాకి సన్నాహాలు 
  • 800 కోట్లు అవుతుందనే అంచనా   

రాజమౌళి తాజా చిత్రంగా థియేటర్లకు వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. దాంతో ఆ తరువాత రాజమౌళి చేయనున్న సినిమా గురించి అంతా ఆసక్తికరంగా మాట్లాడుకోవడం మొదలైపోయింది.

ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో నడుస్తుందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. రాజమౌళికి లైన్ మాత్రమే చెప్పాననీ, త్వరలో పూర్తి కథను వినిపించనున్నానని అన్నారు. ఇక ఈ సినిమా మల్టీ స్టారర్ కాదనీ, హీరోగా మహేశ్ బాబు మాత్రమే కనిపిస్తాడని రీసెంట్ గా రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంలోనే ఆయన ఈ ప్రాజెక్టు 'బాహుబలి' ..  'ఆర్ ఆర్ ఆర్' కంటే పెద్దది అన్నారు. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ వైపు మళ్లింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం 800 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందనే ఒక అంచనాకి వచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాలో మహేశ్ బాబును ఆయన జేమ్స్ బాండ్ గా చూపించనున్నారని అంటున్నారు.

  • Loading...

More Telugu News