Gujarat Titans: ఐపీఎల్ లో నేడు కొత్త జట్ల మధ్య పోరు... కెప్టెన్లుగా బెస్ట్ ఫ్రెండ్స్!

Two new teams face off in IPL

  • ఐపీఎల్ లో తొలిమ్యాచ్ ఆడనున్న గుజరాత్, లక్నో
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
  • గుజరాత్ కు సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా
  • లక్నో కెప్టెన్ గా కేఎల్ రాహుల్

ఐపీఎల్ లో ఈసారి 10 జట్లు ఆడుతుండడం తెలిసిందే. కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి. నేడు ఈ రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. కొత్త జట్లు, కొత్త సీజన్... తొలి విజయం ఎవరిదోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

కాగా, గుజరాత్ జట్టుకు హర్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా, లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా గుర్తింపు పొందారు. అయితే మైదానంలో ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. అన్నట్టు... హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా లక్నో జట్టులో ఉన్నాడు. 

భారత క్రికెట్ రంగంలో హార్దిక్, కృనాల్ పాండ్యా, కేఎల్ రాహుల్... ముగ్గురూ చాలాకాలంగా మిత్రులు. వీళ్లు ఎక్కడ ఉన్నా అక్కడ సందడి నెలకొంటుంది. సోషల్ మీడియాలో వీళ్ల దోస్తీకి సంబంధించి అనేక ఫొటోలు దర్శనమిస్తాయి.

Gujarat Titans
Lucknow Supergiants
Hardik Pandya
KL Rahul
IPL
  • Loading...

More Telugu News