Mahesh Babu: మహేశ్ మూవీలో కన్నడ స్టార్!

Upendra in Trivikram Movie

  • కన్నడలో స్టార్ హీరోగా ఉపేంద్రకు క్రేజ్ 
  •  తెలుగులోను మంచి గుర్తింపు
  •  త్వరలో రానున్న 'గని'లో కీలక పాత్ర 
  •  త్రివిక్రమ్ సినిమాలోను ఛాన్స్ 

కన్నడ స్టార్ హీరోలలో ఉపేంద్ర ఒకరు. చాలా కాలం క్రితమే తెలుగులో హీరోగా స్ట్రైట్ సినిమాలు చేసిన హిట్లు కొట్టారు. ఈ మధ్య కాలంలో తెలుగులో ఆయన కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో పవర్ఫుల్ రోల్ చేసిన ఆయన, త్వరలో రానున్న 'గని' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.

ఇక తాజాగా మహేశ్ బాబు సినిమా కోసం ఉపేంద్రను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాలో ఒక కీలమైన పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఉపేంద్ర పేరు తెరపైకి వచ్చింది. మోహన్ లాల్ కి బదులుగా ఉపేంద్రను తీసుకున్నారా? లేదంటే ఆయనతో పాటు ఉపేంద్ర కూడా ఉన్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. 

ప్రస్తుతం మహేశ్ బాబు చేస్తున్న 'సర్కారువారి పాట' ముగింపు దశలో ఉంది. కీర్తి  సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, మే 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఆ తరువాత ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్టు పైకి రానున్నాడు. ఇందులో కథానాయికగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది.

Mahesh Babu
Pooja Hegde
Upendra
Trivikram Movie
  • Loading...

More Telugu News