Surya: రంగం మీదికి వచ్చేసిన సూర్య!

Surya in  Bala movie

  •   బాల దర్శకత్వంలో సూర్య మూవీ 
  •   కన్యాకుమారిలో మొదలైన షూటింగ్
  •   ఒక కథానాయికగా కృతి శెట్టి 
  •  మరో నాయికగా ఐశ్వర్య రాజేశ్ 


మొదటి నుంచి కూడా సూర్య సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ రాకుండా చూసుకుంటూ వస్తున్నాడు. అలాగే ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'ఈటి' తమిళనాట ఓ మాదిరిగా ఆడింది. ఇక మిగతా భాషల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓ మాదిరి వసూళ్లను కూడా రాబట్టుకోలేకపోయింది. 

ఈ నేపథ్యంలోనే సూర్య తన తాజా చిత్రాన్ని బాల దర్శకత్వంలో సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. సూర్య సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. కన్యాకుమారిలో ఈ రోజునే ఈ సినిమా షూటింగు మొదలైంది. బాల సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఈ కథ కూడా ఆయన మార్కుతోనే నడుస్తుందని అంటున్నారు.

ఈ సినిమాలో సూర్య సరసన నాయిక గా కృతి శెట్టి కనిపించనుంది. ఆమె అదృష్టవంతురాలనడానికి ఇది మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్య జోడీగా కోలీవుడ్ కి పరిచయమయ్యే అవకాశం దొరకడం మామూలు విషయం కాదు. ఇక మరో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Surya
Krithi Shetty
Bala Movie
  • Loading...

More Telugu News