Will Smith: ఆస్కార్ వేదికపై యాంకర్ చెంప చెళ్లుమనిపించిన విల్ స్మిత్... వీడియో ఇదిగో!

Will Smith slaps Chris Rock on Oscars stage

  • ఘనంగా 94వ ఆస్కార్ వేడుక
  • ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ 
  • కింగ్ రిచర్డ్ చిత్రంలో అద్భుత నటన
  • విల్ స్మిత్ భార్యపై జోకు పేల్చిన క్రిస్ రాక్
  • నవ్వుతూనే వెళ్లి దవడ పగలగొట్టిన విల్ స్మిత్

యావత్ ప్రపంచం ఎదురుచూసిన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది. ఈసారి కింగ్ రిచర్డ్ చిత్రానికి గాను విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నాడు. అయితే, అనూహ్యరీతిలో యాంకర్ క్రిస్ రాక్ చెంప పగలగొట్టిన విల్ స్మిత్ వివాదంలో చిక్కుకున్నాడు. 

అసలేం జరిగిందంటే.... కమెడియన్ గా ఎంతో గుర్తింపు ఉన్న క్రిస్ రాక్ తనదైన శైలిలో హాస్యం పండిస్తూ ఆస్కార్ వేదికపై యాంకరింగ్ చేస్తున్నాడు. మాటల మధ్యలో విల్ స్మిత్ అర్ధాంగి జడా పింకెట్ గురించి జోక్ చేశాడు. అనారోగ్యంతో ఉన్న ఆమె గుండుతో కనిపించడంపై కామెడీ చేశాడు. దాంతో, విల్ స్మిత్ నవ్వుతూనే వేదికపైకి వెళ్లి క్రిస్ రాక్ దవడ పేలిపోయేలా కొట్టాడు. ఆపై రాయడానికి వీల్లేని భాషలో కొన్ని పదాలు ఉపయోగించి తన ఆగ్రహం వెలిబుచ్చాడు. వేదిక దిగి వచ్చి కూర్చున్న తర్వాత కూడా విల్ స్మిత్ కొన్ని బూతులు వదిలాడు. 

జరిగిన ఘటనతో దిగ్భ్రాంతికి లోనైన క్రిస్ రాక్ కాసేపటి తర్వాత తేరుకుని ఎప్పట్లాగే యాంకరింగ్ కొనసాగించాడు. అయితే, చాలామంది విల్ స్మిత్ ఇలా చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆస్కార్ అవార్డుల నిర్వాహకులు సైతం ఇలాంటివి తాము ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News