Jagan: నెల్లూరు చేరుకున్న జగన్.. షెడ్యూల్ వివరాలు!

Jagan reaches Nellore

  • గన్నవరం నుంచి రేణిగుంటకు.. అక్కడి నుంచి నెల్లూరుకు చేరుకున్న సీఎం
  • మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో పాల్గొననున్న జగన్
  • సభ ముగిసిన వెంటనే గన్నవరంకు తిరుగుపయనం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి హెలికాప్టర్ లో బయల్దేరి నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ల్యాండ్ అయ్యారు. 

ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటన షెడ్యూల్ ఇదే:
  • ఉదయం 11.50 గంటలకు నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్న సీఎం. 
  • 11.50 నుంచి 12.40 వరకు దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో పాల్గొంటారు. 
  • అనంతరం హెలిపాడ్ కు చేరుకుంటారు. 
  • మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్ లో రేణిగుంటకు పయనం. 
  • మధ్యాహ్నం 1.20 గంటలకు రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు పయనం.

మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన పయనించే మార్గంలో రాకపోకలను నిషేధించాలని పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News