Nagashourya: ఈ అమ్మాయిలేంట్రా అసలు అర్థంకారు .. 'కృష్ణ వ్రింద విహారి' టీజర్ రిలీజ్!

Krishna Vrinda Vihari teaser released

  • ప్రేమకథా చిత్రంగా 'కృష్ణ వ్రింద విహారి'             
  • నాగశౌర్య జోడీగా కొత్త హీరోయిన్ 
  • దర్శకుడిగా అనీష్ కృష్ణ 
  • ఏప్రిల్ 22వ తేదీన రిలీజ్

వీలైతే సొంత సినిమా .. కుదిరితే బయట సినిమా అన్నటుగా నాగశౌర్య వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ వెళుతున్నాడు. ఒక వైపున యాక్షన్ హీరోగా .. మరో వైపున ఫ్యామిలీ హీరోగా తనని తాను నిరూపించుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే 'కృష్ణ వ్రింద విహారి' సినిమాను పూర్తిచేశాడు.

నాగశౌర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో షిర్లే సెటియా కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది .. రొమాన్స్ పాళ్లు ఎక్కువేననే విషయం స్పష్టమవుతోంది.
      
హీరోయిన్ ప్రేమ కోసం హీరోపడే ఆరాటం .. ఆమె అలకలు .. బుజ్జగింపులు .. ఈ అమ్మాయిలేంట్రా అసలు అర్థంకారు అంటూ స్నేహితుల దగ్గర అసహనాన్ని ప్రదర్శించడం .. 'పెళ్లి చేసుకుందాం'లో వెంకటేశ్ కంటే బాగా చూసుకుంటాను వంటి కామెడీ టచ్ తో ఈ టీజర్ నడిచింది. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News