Ramcharan: ఈ పుట్టినరోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తాను: రామ్ చరణ్

Ram Charan statement on RRR grand success
  • మార్చి 27న రామ్ చరణ్ జన్మదినం
  • నిన్న విడుదలైన ఆర్ఆర్ఆర్
  • బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు
  • సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిత్రబృందం
  • పలు భాషల్లో తన సందేశం వెలువరించిన చరణ్
ఎన్టీఆర్ తో కలిసి తాను నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించిన నేపథ్యంలో రామ్ చరణ్ స్పందించారు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

"ఎస్ఎస్ రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంగా ఈ సినిమా చూసిన అందరికీ నా కృతజ్ఞతలు" అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు, రేపు (మార్చి 27) తన జన్మదినం కాగా... ఈ అపూర్వమైన పుట్టినరోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తానని రామ్ చరణ్ వివరించారు. 

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లతో బాహుబలి-2 రికార్డును తిరగరాసింది. ఆర్ఆర్ఆర్ చిత్రం తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరే భారతీయ చిత్రం ఈ ఘనత సాధించలేదు.
Ramcharan
RRR
Grand Sussess
Birthday
Rajamouli
Jr NTR
Tollywood

More Telugu News