China: విమాన ప్ర‌మాదంలో 132 మంది దుర్మ‌ర‌ణం.. చైనా అధికారిక ప్ర‌క‌ట‌న‌

all 132 members on board in china flight are dead
  • ఈ నెల 21న ప్ర‌మాదం
  • ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 132 మంది
  • అంద‌రూ చ‌నిపోయార‌ని చైనా అధికారిక ప్ర‌క‌ట‌న‌
చైనాలో చోటుచేసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి ఆ దేశ పౌర విమాన‌యాన శాఖ కాసేప‌టి క్రితం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో ఉన్న ప్ర‌యాణికులు, సిబ్బంది.. మొత్తం 132 మంది చ‌నిపోయిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ మేర‌కు చైనా విమాన‌యాన శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ హూ జెంజియాంగ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ నెల 21న చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంలో 132 మందితో బయల్దేరిన చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737–800 విమానం నిట్టనిలువునా దూసుకెళ్లి కొండల్లో కూలిపోయిన సంగతి తెలిసిందే. కూలిపోయే సమయంలో ధ్వని వేగానికి సమానంగా విమానం దూసుకురావడంతో విమానంలోని అందరూ చనిపోయి ఉంటార‌న్న వాద‌న‌లు వినిపించాయి. ఆ వాద‌న‌లే నిజ‌మ‌న్న రీతిలో ఇప్పుడు చైనా అధికారికంగా ఈ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.
China
Accident
Flight Crashing

More Telugu News