Goa: 28న గోవా సీఎంగా ప్ర‌మోద్ ప్ర‌మాణం.. హాజ‌రుకానున్న‌ మోదీ, అమిత్ షా

pramod sawant will take oath as goa cm on 28th

  • గోవాకు రెండో సారి సీఎంగా ప్ర‌మోద్‌
  • భారీ ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు
  • ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సావంత్‌

ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత నాలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే కొత్త ప్ర‌భుత్వాలు ఏర్ప‌డ్డాయి. ఇక చివ‌రి రాష్ట్రమైన గోవాలోనూ కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఖ‌రారైపోయింది. ఈ నెల 28న గోవా సీఎంగా బీజేపీ నేత ప్ర‌మోద్ సావంత్ ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌నున్నారు.

గోవాలోని తాలీగావోలో ఈ మేర‌కు ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. న‌గ‌రంలోని శ్యాం ప్ర‌సాద్ ముఖ‌ర్జీ స్టేడియంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ప్ర‌మోద్ సావంత్ శ‌నివారం ప‌రిశీలించారు. ఈ వేడుక‌కు ప్రధాని న‌రేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు హాజ‌రుకానున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించ‌గా.. వ‌రుస‌గా రెండోసారి గోవాకు సీఎంగా సావంత్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News