Anam Ramanarayana Reddy: అటవీ అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం ఆగ్రహం

Anam Ramanarayana Reddy fires on forest officers
  • అటవీ అధికారులు అవరోధ శాఖ అధికారులుగా తయారయ్యారన్న ఆనం
  • కేంద్ర నిధులతో మంజూరైన రహదారులను అడ్డుకుంటున్నారు
  • ప్రజా ప్రతినిధుల మాటలను కూడా లెక్క చేయడం లేదు

అటవీ అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మండిపడ్డారు. జిల్లాపరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అవరోధ శాఖ అధికారులుగా తయారయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరైన రహదారులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజా ప్రతినిధుల మాటలను కూడా అధికారులు లెక్క చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అధికారులు సిగ్గు పడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Anam Ramanarayana Reddy
YSRCP
Forest Officers

More Telugu News