Yogi Adityanath: రెండోసారి సీఎంగా యోగి.. తొలి నిర్ణయం ఇదే!

Yogis first decision in his second term

  • నిన్న మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన యోగి
  • ఈరోజు సెకండ్ టర్మ్ తొలి కేబినెట్ సమావేశం నిర్వహణ
  • ఉచిత రేషన్ బియ్యం పంపిణీ పథకాన్ని పొడిగిస్తూ తొలి నిర్ణయం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో సారి బాధ్యతలను స్వీకరించారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం నిన్న అట్టహాసంగా జరిగింది. రెండో సారి సీఎం అయిన యోగి.. ఈరోజు తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. 

రెండో సారి సీఎం అయిన యోగి.. ఈ సమావేశంలో తొలి నిర్ణయం తీసుకున్నారు. ఉచిత రేషన్ బియ్యం పంపిణీ (ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30వ తేదీ వరకు ఈ పథకాన్ని అమలు చేస్తామని యోగి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతారని అన్నారు. వాస్తవానికి ఈ పథకం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పథకాన్ని పొడిగిస్తూ యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News