Prakash Raj: 'అప్పూ ఎక్స్‌ప్రెస్' పేరుతో మ‌రిన్ని సేవ‌లు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌కాశ్ రాజ్

Prakash Raj says Im extremely happy to announce this

  • కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్ పేరిట సేవ‌లు
  • ‘ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌’ ద్వారా త్వ‌ర‌లో ప్రారంభం
  • పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతాన‌న్న ప్ర‌కాశ్ రాజ్

సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఈ రోజు తన పుట్టినరోజు వేడుక జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అప్పూ ఎక్స్‌ప్రెస్ పేరిట ఓ ఫొటో పోస్ట్ చేశారు. కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్ ను అప్పూగా పిలుస్తార‌న్న విష‌యం తెలిసిందే. త‌న ‘ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌’ ద్వారా అప్పూ ఎక్స్‌ప్రెస్ పేరుతో త‌న సేవ‌ల‌ను మ‌రింత‌ ముందుకు తీసుకెళ్తున్నట్లు ప్ర‌కాశ్ రాజ్ చెప్పారు. 

ఈ విష‌యాన్ని ఆనంద‌భ‌రితంగా ప్ర‌క‌టిస్తున్నాన‌ని అన్నారు. అయితే, దీనిపై పూర్తి వివ‌రాలు చెప్ప‌లేదు. ప్ర‌కాశ్ ఇప్ప‌టికే తన ఫౌండేషన్‌ ద్వారా అనేక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ ఆయ‌న పేద‌ల‌కు సేవ‌లు అందించారు. పునీత్ రాజ్‌కుమార్ కూడా ప్ర‌జా సేవ‌లో ముందుండేవారు. త్వ‌ర‌లోనే త‌న కొత్త కార్య‌క్ర‌మంపై ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News