student: కాలేజీ వ‌స‌తి గృహంలో అమ్మాయి ఆత్మ‌హ‌త్య‌.. ప్రేమ లేఖ‌లు, గిఫ్టులు స్వాధీనం

student commits suicide

  • తిరుపతిలోని పద్మావతి మహిళా జూనియర్ కాలేజీలో ఘ‌ట‌న‌
  • పోలీసుల‌కు సమాచారం అందించిన హాస్ట‌ల్ సిబ్బంది
  • ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం

తిరుపతిలోని పద్మావతి మహిళా జూనియర్ కాలేజీ వ‌స‌తి గృహంలో క‌ల‌క‌లం చెల‌రేగింది. వసతి గృహంలో ఉరి వేసుకుని ఓ విద్యార్థిని ఆత్మ‌హత్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై వ‌స‌తి గృహం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న‌ పోలీసులు ఆ విద్యార్థిని ఉంటోన్న గ‌దిని పరిశీలించ‌గా ప‌లు వ‌స్తువులు ల‌భ్య‌మ‌య్యాయి. 

వాటిని బ‌ట్టి ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ఓ అంచ‌నాకు వ‌చ్చారు. హాస్టల్‌లో ప‌లు ప్రేమ లేఖలు, ప్రియుడు పంపిన గిఫ్టుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామ‌ని, దర్యాప్తు  కొన‌సాగుతోంద‌ని పోలీసులు చెప్పారు.  

  • Loading...

More Telugu News