Kishan Reddy: సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి... సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని సలహా

Kishan Reddy advice to AP CM Jagan

  • న్యాయస్థానాల పరిధిపై సీఎం జగన్ వ్యాఖ్యలు
  • న్యాయవ్యవస్థలను గౌరవించాలన్న కిషన్ రెడ్డి
  • దెబ్బతీసే ప్రయత్నాలు వద్దని హితవు

ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. న్యాయవ్యవస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు. హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని సలహా ఇచ్చారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ కు ఆ హక్కు ఉందని స్పష్టం చేశారు. అంతేతప్ప వ్యవస్థలను దెబ్బతీసే ప్రయత్నం చేయరాదని అన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ, పత్రికా వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Kishan Reddy
CM Jagan
Judiciary System
Courts
Amaravati
AP Assembly
Andhra Pradesh
  • Loading...

More Telugu News