RRR: తారక్, చరణ్ ల ఎంట్రీ సీన్లు.. భారతీయ సినిమాలోనే అద్భుతం: ప్రముఖ సినీ విమర్శకుడు సుమీత్ రివ్యూ
- సినిమాకు 4 స్టార్ల రేటింగ్
- డైరెక్షన్ కు 4.5 పాయింట్లు
- ఎన్టీఆర్ నటనా తీవ్రత అద్భుతమని ప్రశంస
- రామ్ చరణ్ నటన బాగుందని కామెంట్
- భారతీయ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ హిట్
ప్రముఖ సినీ విమర్శకుడు సుమీత్ కడేల్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు 4 రేటింగ్ ఇచ్చాడు. రాజమౌళి డైరెక్షన్ కు 4.5 రేటింగ్ ఇచ్చిన అతడు.. కథ, కథనానికి 3.5 స్టార్లు ఇచ్చాడు. నిర్మాణ విలువలు బాగున్నాయన్న అతడు 4.5 పాయింట్లు వేశాడు. మాటలకు 4, సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు 4, సినిమాటోగ్రఫీకి 4.5, నటీనటుల నటనకు 4 స్టార్ల చొప్పున రేటింగ్ ఇచ్చాడు.
మొత్తంగా సినిమా చాలా అద్భుతంగా ఉందని, యాక్షన్ అదుర్స్ అని కొనియాడాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటనతో అదరగొట్టారని అన్నాడు. ఇంటర్వల్, క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ ను ఇస్తాయని చెప్పాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఎంట్రీ సీన్లు.. భారతీయ సినిమాలోనే బెస్ట్ అని చెప్పాడు. ఆర్ఆర్ఆర్ సోల్ లో ఇద్దరూ ఒదిగిపోయారన్నాడు. తన జీవితాంతం గుర్తుండిపోయే నటన ఎన్టీఆర్ ది అని అన్నాడు. నటనలో అతడి తీవ్రత, భావోద్వేగాలకు ఎవరి నటన సాటి రాదన్నాడు. రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని చెప్పాడు.
రాజమౌళి దర్శకత్వ ప్రతిభను మరోసారి నిరూపించాడని తెలిపాడు. అతడి దర్శకత్వంలో ఎలాంటి లోటుపాట్లు లేవని సుమీత్ అన్నాడు. డ్రామాను బాగా రక్తికట్టించాడని, భావోద్వేగ సన్నివేశాలు సూపర్ అని అన్నాడు. అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాలు బాగాలేకపోయినా.. పవర్ ఫుల్ సన్నివేశాలు వాటిని కప్పేస్తాయని చెప్పాడు.
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ పాత్ర కొద్దిసేపే ఉన్నా.. అత్యంత పవర్ ఫుల్ గా ఉంటుందని పేర్కొన్నాడు. ఆలియా కూడా కొంత సేపే కనిపించినా ఆకట్టుకుందని, చాలా అందంగా ఉందని పేర్కొన్నాడు. ఇండియన్ సినిమాలో ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోతుందని చెప్పాడు.