Corona Virus: తెలంగాణ‌లో 49 కొత్త కేసులు.. మ‌ర‌ణాలు నిల్‌!

telangana corona daily updates

  • గత 24 గంటల్లో 20,444 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 22 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 67 మంది
  • ఇంకా 619 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,444 కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో కరోనా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,038 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,308 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 619 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

Corona Virus
Telangana
corona bulletin
  • Error fetching data: Network response was not ok

More Telugu News