Junior NTR: 'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ బైక్ కోసం అన్ని లక్షలు ఖర్చు చేశారట!

RRR movie update

  • రాజమౌళి తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్'
  • ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల
  • చరిత్రను కలుపుకుని నడిచే కథ
  • సంగీత దర్శకుడిగా కీరవాణి   

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆదిలో వాళ్ల దారులు వేరైనా ఆ తరువాత కలిసి ఆంగ్లేయులపై చేసే పోరాటాన్ని చూపించనున్నారు.

ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లలో .. ఎన్టీఆర్ ఆనాటి బైక్ నడుపుతూ కనిపించిన పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఆంగ్లేయుల కాలానికి సంబంధించిన బైక్ కావడంతో, దీనిని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారనే ఆశ్చర్యం చాలామందికి కలిగింది. అప్పటి మోడల్ భలేగా ఉందే అనుకున్నారు. 

అయితే ఆనాటి మోడల్ బైక్ కోసం రాజమౌళి చాలా ట్రై చేశారట. చివరికి ఎక్కడా లేకపోవడంతో, ఆనాటి బైకులు ఎలా ఉండేవో తెలుసుకుని ప్రత్యేకించి తయారు చేయించారట. ఈ బైక్ ను ఇలా డిజైన్ చేయించడానికి దాదాపు 20 లక్షల రూపాయల వరకూ ఖర్చు అయిందని చెబుతున్నారు. ఇలా ఆనాటి వస్తువుల కోసం భారీగానే ఖర్చు చేశారట.

  • Error fetching data: Network response was not ok

More Telugu News