Rajamouli: ఆర్ఆర్ఆర్ విడుద‌ల నేప‌థ్యంలో రాజ‌మౌళి భారీ క‌టౌట్లు.. ఫొటోలు ఇవిగో

rajamouli pics go viral

  • ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ 
  • ప‌లు థియేట‌ర్ల ముందు హీరోలతో పాటు రాజ‌మౌళి క‌టౌట్లు
  • అప్పుడే థియేట‌ర్ల వ‌ద్ద సంబ‌రాలు

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల‌తో ఆయ‌న రూపొందించిన సినిమా ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌కు సర్వం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో ప‌లు థియేట‌ర్ల ముందు రాజ‌మౌళి భారీ క‌టౌట్లు క‌న‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. 

                    
సాధార‌ణంగా హీరో, హీరోయిన్ల‌ క‌టౌట్లు సినిమాల విడుద‌ల వేళ క‌న‌ప‌డుతుంటాయి. అందుకు భిన్నంగా రాజ‌మౌళి భారీ క‌టౌట్లు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. కాగా, సినిమా విడుద‌లవుతున్న నేప‌థ్యంలో అప్పుడే థియేట‌ర్ల వ‌ద్ద సంబ‌రాలు మొద‌లయ్యాయి. ఒక‌రోజు ముందుగానే ప‌లు థియేట‌ర్ల ముందు బాణ‌సంచా కాల్చారు అభిమానులు.  

 

   

Rajamouli
RRR
Ramcharan
Junior NTR
  • Error fetching data: Network response was not ok

More Telugu News