Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 304 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 69 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన డా. రెడ్డీస్, టాటా స్టీల్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలహీనపరిచాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్లు కోల్పోయి 57,684కి పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 17,245 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.31%), టాటా స్టీల్ (2.15%), ఐటీసీ (0.86%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.65%), ఎన్టీపీసీ (0.45%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.36%), కోటక్ బ్యాంక్ (-2.25%), భారతి ఎయిర్ టెల్ (-1.97%), సన్ ఫార్మా (-1.65%), మారుతి (-1.54%).

  • Loading...

More Telugu News