Andhra Pradesh: ఏపీ ఎంసెట్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవిగో!

AP EAPCET Schedulr released

  • జులై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్షలు
  • జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు
  • ఏప్రిల్ 11న విడుదల కానున్న నోటిఫికేషన్

ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను కాసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ మీడియా పాయింట్లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ షెడ్యూల్ వివరాలను ప్రకటించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు సంబంధించిన తేదీలను వెల్లడించారు. 

జులై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్షలను ఐదు రోజుల్లో 10 సెషన్లలో నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలను నాలుగు సెషన్లలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 134 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నట్టు చెప్పారు. 

అవసరమైతే సెంటర్ల సంఖ్యను పెంచుతామని చెప్పారు. అంతేకాదు తెలంగాణలో కూడా 4 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీన పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని చెప్పారు.

Andhra Pradesh
EAPCET
Schedule
Adimulapu Suresh
  • Loading...

More Telugu News