Rajamouli: మహేశ్ తో రాజమౌళి చేసేది మామూలు సినిమా కాదు!

Mahesh Babu in Rajamouli movie

  • రిలీజ్ కి రెడీగా 'ఆర్ ఆర్ ఆర్'
  • ప్రమోషన్స్ లో బిజీగా రాజమౌళి
  • నెక్స్ట్ ప్రాజెక్టు మహేశ్ బాబుతో
  • 'ఆర్ ఆర్ ఆర్'కి మించి ఉంటుందన్న రాజమౌళి     

రాజమౌళి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో దిగిపోనుంది. మొదటిసారిగా రాజమౌళి చేస్తున్న మల్టీ స్టారర్ కావడం .. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం ..  టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఆర్టిస్టులు యాక్ట్ చేయడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమా తరువాత ప్రాజెక్టును రాజమౌళి .. మహేశ్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు గురించిన ప్రస్తావన తీసుకువస్తే, 'ఆర్ ఆర్ ఆర్' పై నుంచి అందరి దృష్టి ఆ వైపు వెళుతుందని రాజమౌళి దాటేస్తూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాత్రం మహేశ్ బాబు సినిమాను గురించి ప్రస్తావించారు. 

మహేశ్ బాబుతో అనుకున్న లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనీ, 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ తరువాత ఆ లైన్  కి పూర్తి కథా రూపాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఇది మహేశ్ బాబు సోలో హీరోగా చేసే సినిమా అనీ, 'బాహుబలి' .. 'ఆర్ ఆర్ ఆర్' కి మించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.

  • Loading...

More Telugu News