Chiranjeevi: చిరూతో రీమేక్ చేయనున్న హరీశ్ శంకర్?

Bro Daddy Movie Remake

  • మాస్ లో హరీశ్ శంకర్ కి మంచి పేరు
  • త్వరలో సెట్స్ పైకి పవన్ సినిమా 
  • ఆ తరువాత ప్రాజెక్టు మెగాస్టార్ తో
  • 'బ్రో డాడీ' సినిమా రీమేక్ కి సన్నాహాలు  

అటు యూత్ .. ఇటు మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీశ్ శంకర్ కనిపిస్తాడు. లవ్ ..  యాక్షన్ .. ఎమోషన్  .. కామెడీ .. ఇలా అన్ని అంశాలు తన సినిమాల్లో ఉండేలా ఆయన చూసుకుంటాడు. పవన్ కి 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్, ఆయనతో 'భవదీయుడు భగత్ సింగ్' చేయడానికి రెడీ అవుతున్నాడు. 

ఈ సినిమా తరువాత చిరంజీవితో ఒక ప్రాజెక్టు చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. మలయాళంలో ఈ జనవరిలో వచ్చిన 'బ్రో డాడీ' సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. మోహన్ లాల్ ..  పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమా తెలుగు రీమేక్ లో చిరంజీవి చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా బాధ్యతలను హరీశ్ శంకర్ కి అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కి సంబంధించిన మార్పులు  .. చేర్పుల గురించిన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.  

Chiranjeevi
Harish Shankar
Bro Daddy Movie Remake
  • Loading...

More Telugu News