Puneeth Rajkumar: నాలుగు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'జేమ్స్'

James Movie Update

  • 'జేమ్స్' గా పునీత్ రాజ్ కుమార్
  • కథానాయికగా ప్రియా ఆనంద్ 
  • కీలకమైన పాత్రలో శ్రీకాంత్  
  • ఈ నెల 17న విడుదలైన సినిమా

కన్నడ స్టార్ హీరోల్లో పునీత్ రాజ్ కుమార్ ఒకరు. హీరోగానే  కాదు .. మంచి మనిషిగా అక్కడ ఆయనకి మంచి పేరు ఉంది. ఇక ఇతర ఇండస్ట్రీ హీరోలతోను ఆయనకి మంచి అనుబంధం ఉంది. కన్నడలో ఇతర భాషల హీరోల సినిమాలను కూడా ఎంతో ఉత్సాహంగా ప్రమోట్ చేయగలగడం ఆయన గొప్పతనమని చెబుతుంటారు. 

అలాంటి పునీత్ రాజ్ కుమార్ తన అభిమానులను శోకసముద్రంలో ముంచేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. 'జేమ్స్' సినిమాను పూర్తిచేసిన తరువాత ఈ దారుణం జరిగింది. పునీత్ పాత్రకి శివరాజ్ కుమార్ వాయిస్ ఇచ్చారు. కిశోర్ పత్తికొండ నిర్మించిన ఈ సినిమాకి చేతన్ కుమార్ దర్శకత్వం వహించాడు. 

ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగించింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు.

Puneeth Rajkumar
Priya Anand
James Movie
  • Loading...

More Telugu News