Nalini: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళిని

Rajiv Gandhi assassination convict Nalini applies bail petition

  • ఇటీవలే పెరారివాలన్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో సబ్ పిటిషన్ వేసిన నళిని
  • తనకు బెయిల్ పొందే అర్హత ఉందని పిటిషన్ లో పేర్కొన్న వైనం


దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న పెరారివాలన్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో మరో దోషిగా ఉన్న నళిని కూడా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో సబ్ అప్లికేషన్ దాఖలు చేశారు.

మూడు దశాబ్దాలకు పైగా జైలు జీవితం గడిపిన కారణంగా పెరారివాలన్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన సబ్ పిటిషన్ లో నళిని పేర్కొన్నారు. తాను కూడా మూడు దశాబ్దాలకు పైగా జైలు జీవితాన్ని గడిపానని, తనకు కూడా బెయిల్ పొందే అర్హత ఉందని చెప్పింది. 

మరోవైపు తమిళనాడు సీఎంగా స్టాలిన్ బాధ్యతలను చేపట్టిన వెంటనే.. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులకు యావజ్జీవ శిక్షను ఎత్తివేయాలని, వారిని విడుదల చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్రపతి కోవింద్ ను కోరారు. హత్య కేసులోని దోషుల్లో నళిని, పెరారివాలన్, జయకుమార్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పాయస్, పి. రవిచంద్రన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News