Posani Krishna Murali: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి గురించి నేను ఒకే ఒక్క మాట చెబుతా.. రెండో ప్ర‌శ్నే అడ‌గడానికి వీల్లేదు: పోసాని

posani on jagan

  • జ‌గ‌న్ దూరం నుంచి బ్ర‌హ్మ ప‌దార్థంలా క‌న‌బ‌డ‌తారు
  • ద‌గ్గ‌రి నుంచి చూస్తే దేవుడి ప్ర‌సాదంలా క‌న‌ప‌డ‌తారు
  • ప్ర‌స్తుతం నేను ఐదారు సినిమాల్లో న‌టిస్తున్నాను

సినీన‌టుడు పోసాని కృష్ణమురళి ఈ రోజు ఉద‌యం తిరుమ‌ల‌ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... ''ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి గురించి నేను ఒకే ఒక్క మాట చెబుతా. రెండో ప్ర‌శ్నే అడ‌గడానికి వీల్లేదు. ఆయ‌న దూరం నుంచి బ్ర‌హ్మ ప‌దార్థంలా క‌న‌బ‌డ‌తారు.. ద‌గ్గ‌రి నుంచి చూస్తే దేవుడి ప్ర‌సాదంలా క‌న‌ప‌డ‌తారు'' అన్నారు. 
 
ఇక ప్ర‌స్తుతం తాను ఐదారు సినిమాల్లో న‌టిస్తున్నాన‌ని అన్నారు. ఏ ప‌ని అందుబాటులో ఉంటే తాను ఆ ప‌ని చేస్తాన‌ని అన్నారు. తాను శ్రీ‌వారి సన్నిధికి ఎన్నిసార్లు వ‌చ్చానో లెక్క‌లేద‌ని అన్నారు. చిన్న‌ప్పుడు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు త‌న మేన‌మామ తొలిసారి త‌న‌ను ఇక్క‌డ‌కు తీసుకొచ్చార‌ని అన్నారు. దేవుడి ద‌య వ‌ల్ల‌, ప్రేక్ష‌కుల ద‌య వ‌ల్ల తాను సంతోషంగా ఉన్నాన‌ని తెలిపారు. తాను హీరోగా రెండు సినిమాల్లో న‌టించాన‌ని పోసాని కృష్ణమురళి అన్నారు.

  • Loading...

More Telugu News