Kathi Mahesh: అదే జోరుతో దూసుకుపోతున్న మహేశ్ 'పెన్నీ' సాంగ్!

Sarkaru Vaari Paata movie update

  • ముగింపు దశలో 'సర్కారువారి పాట'  
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • బ్యాంకు స్కామ్ నేపథ్యంలో  సాగే సాంగ్ 
  • మే 12వ తేదీన విడుదల   

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ - 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా 'కళావతి' పాటను వదలగా రికార్డు స్థాయి వ్యూస్ ను రాబట్టింది. అనంత శ్రీరామ్ రాసిన ఆ పాట, బీట్ పరంగా .. సాహిత్యం పరంగా  కూడా మంచి మార్కులు కొట్టేసింది. అనంత్ శ్రీరామ్ రాసిన మరో పాటను రీసెంట్ గా వదిలారు. ఈ పెన్నీ సాంగ్ లో మహేశ్ బాబు కూతురు సితార మెరవడం మరో విశేషం. 

బ్యాంక్ లోన్ తీసుకుని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తే, నువ్వు గుడిలో ఉన్నా .. గుహలో ఉన్నా వదిలిపెట్టను అనే అర్థంలో మహేశ్ వైపు నుంచి సాగే పాట ఇది. ఇప్పటికే ఈ సినిమా 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ .. 500K ప్లస్ లైక్స్ ను సాధించడం విశేషం. మే 12వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News