CM KCR: బీజేపీ నేత ఈటల రాజేందర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR wishes Eatala Rajendar on his birthday

  • నేడు ఈటల పుట్టినరోజు
  • ఈటలపై శుభాకాంక్షల జడివాన
  • లేఖ పంపిన కేసీఆర్
  • నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్ష

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బీజేపీ నేతలు ఈటలపై శుభాకాంక్షలు వెల్లువెత్తించారు. ఆశ్చర్యకరంగా సీఎం కేసీఆర్ కూడా ఈటలకు విషెస్ తెలిపారు. ఏకంగా ఓ లేఖ రాశారు. ఈటల నిండు నూరేళ్లు జీవించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 

తీవ్ర పరిణామాల మధ్య ఈటల రాజేందర్ మంత్రి పదవిని కోల్పోవడం, ఆపై బీజేపీలో చేరడం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈటలపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో, కేసీఆర్ తో ఆయనకు తీవ్ర అంతరం ఏర్పడిందని భావించారు. అయితే ఈటల పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలపడం ద్వారా కేసీఆర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

CM KCR
Eatala Rajendar
Birthday
Wishes
Letter
  • Loading...

More Telugu News