SBI: ఎస్బీఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం... ఓ ప్రకటనలో వెల్లడించిన బ్యాంకు వర్గాలు

SBI says some inconvenience will occur due to technology upgrade

  • నేటి రాత్రి 11.30 గంటల నుంచి అంతరాయం
  • టెక్నాలజీ అప్ గ్రేడ్ చేస్తున్నట్టు వెల్లడి
  • నిలిచిపోనున్నఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీ సేవలు

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారుల కోసం ఓ ప్రకటన చేసింది. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగనుందని ఎస్బీఐ వెల్లడించింది. మార్చి 20వ తేదీ రాత్రి 11.30 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ ఆధారిత సేవలు నిలిచిపోతాయని తెలిపింది. 

ఆయా వేదికలకు సంబంధించిన టెక్నాలజీ అప్ గ్రేడ్ చేస్తున్నామని బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని, ఖాతాదారులు సహకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News