Bihar: హోలీ రోజూ డీజే పెట్టాడని యువకుడిని కొట్టి చంపిన పోలీసులు.. స్టేషన్ కు నిప్పు పెట్టిన ప్రజలు.. దాడిలో కానిస్టేబుల్ మృతి

Public Set Ablaze Police Station After youth Died In Police Custody in Bihar

  • బీహార్ లోని బెతియాలో దారుణ ఘటన
  • డీజే పెట్టిన యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • కస్టడీలో మృతి చెందిన యువకుడు
  • విషయం తెలిసి స్టేషన్ ముందు గ్రామస్థుల ఆందోళన
  • పోలీసులను పరిగెత్తించి కొట్టిన గ్రామస్థులు

హోలీ రోజు పెట్టిన డీజే ఓ యువకుడి మృతి.. ఆ తర్వాత ప్రజలు దాడి చేసి పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టడం, ఓ పోలీస్ కానిస్టేబుల్ చనిపోవడం దాకా దారితీసింది. ఈ ఘటనలో మరో పది మంది పోలీసులకు గాయాలయ్యాయి. బీహార్ లోని పశ్చిమ చంపారన్ లో ఉన్న బెతియా గ్రామంలో నిన్న ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో డీజే పెట్టి ఆనందోత్సాహాల మధ్య ప్రజలు హోలీ పండుగను జరుపుకుంటున్నారు. 

అయితే, బాల్తర్ పోలీసులు డీజే వద్దని వారించి.. డీజే పెట్టిన అనిరుధ్ యాదవ్ అనే యువకుడిని స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకుడు చనిపోయాడు. విషయం తెలుసుకున్న వందలాది మంది గ్రామస్థులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అనిరుధ్ ను పోలీసులే కొట్టి చంపారని ఆరోపించారు. పోలీసు జీపుపై అతడి మృతదేహాన్ని పెట్టి ఆందోళన చేశారు. 

పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. వారు వినిపించుకోలేదు. అదే ఆగ్రహంతో పోలీసులపైకి గ్రామస్థులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులు తీస్తూ అక్కడి నుంచి పారిపోయారు.

  • Loading...

More Telugu News