Banks: నెలాఖ‌రున 4 రోజులపాటు బ్యాంకుల బంద్‌!

Banks closed for 4 days at the end of the month
  • 26న నాలుగో శ‌నివారం, 27న ఆదివారం
  • 28, 29 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె
  • మొత్తంగా నాలుగు రోజులు బ్యాంకులు తెర‌చుకోవు
అస‌లే నెలాఖ‌రు. చేతికందిన జీత‌మంతా అయిపోయి త‌దుప‌రి నెల జీతం కోసం ఎదురు చూసే స‌మ‌యం. ఇలాంటి నేప‌థ్యంలో బ్యాంకుల‌కు వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు సెల‌వు వ‌స్తోంది. వెర‌సి అల‌ర్ట్‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల విషయంలో అసంతృప్తిగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు  ఈనెల 28, 29 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. 

ఈ మేర‌కు ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నట్లు ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించాయి. అయితే అంతకన్నా ముందు మార్చి 26న నాలుగో శనివారం, మార్చి 27న ఆదివారం కారణంగా బ్యాంకులు తెరుచుకోవు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో కలుపుకుని మార్చి 26 నుంచి 29 వరకు మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
Banks
Holidays
Employees Strike

More Telugu News