Venkaiah Naidu: కాషాయంలో తప్పేముంది?: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు
![venkaiah naidu comments on education system](https://imgd.ap7am.com/thumbnail/cr-20220319tn6235f81701bdd.jpg)
- భారతీయ గుర్తింపును గౌరవంగా భావించాలి
- వలస వాద తత్వాన్ని విడనాడాలి
- మెకాలే నాటి విద్యా వ్యవస్థకు వీడ్కోలు పలకాలన్న ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నోట నుంచి శనివారం సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారతీయ విద్యా వ్యవస్థను కాషాయీకరణం చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. కాషాయంలో తప్పేముంది అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. గుదిబండగా మారిన మెకాలే విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్నిన అవసరం ఉందని కూడా ఆయన పునరుద్ఘాటించారు.
దేవ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకాన్సిలియేషన్ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ భారతీయుడిగా గుర్తింపు పొందడాన్ని గౌరవంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా వలస వాద తత్వాన్ని భారతీయులు విడనాడాల్సి ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు.