TDP: రెట్టింపు ఉత్తేజంతో, రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ వచ్చాం!: ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించిన టీడీపీ

tdp rwitter handle re entry at night

  • హ్యాక‌ర్ల బారిన ప‌డిన టీడీపీ ట్విట్ట‌ర్ ఖాతా
  • ఉద‌యం నుంచి క‌నిపించ‌కుండాపోయిన వైనం
  • సాయంత్రానికంతా స‌మ‌స్య ప‌రిష్కారం
  • రాత్రి 7.30 గంట‌ల‌కు తిరిగి ప్ర‌త్య‌క్షం

నిజంగానే టీడీపీ శ్రేణులు హ‌మ్మ‌య్యా అని ఊపిరి పీల్చుకున్నాయి. హ్యాక‌ర్ల కార‌ణంగా శ‌నివారం ఉద‌యం క‌నిపించ‌కుండా పోయిన తెలుగు దేశం పార్టీ ట్విట్ట‌ర్ ఖాతా ఎట్ట‌కేల‌కు రాత్రి 7.30 గంట‌ల‌కు తిరిగి ప్ర‌త్య‌క్ష‌మైంది. హ్యాకింగ్ ఉచ్చును చీల్చుకుని వ‌చ్చిన‌ట్టు టీడీపీ ట్విట్ట‌ర్ ఖాతా.. త‌న తొలి ట్వీట్‌గా అదే విష‌యాన్ని పోస్ట్ చేసింది.

 "దొంగ దారులు తొక్కి పొద్దున్నుంచీ ఎంత పని పెట్టార్రా బ్లూ బఫూన్స్!
 ఇంకా కొంచెం కసి పెంచారు మా పేజీ జోలికి వచ్చి!! 
 కాస్కో A 1, A 2 అండ్ పేటీఎం బ్యాచ్... 
  రెట్టింపు ఉత్తేజంతో, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ వచ్చాం!!
 జై తెలుగుదేశం!!" అంటూ తమ ట్వీట్ లో పేర్కొన్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News