Pavan Kalyan: 'రావణాసుర' దర్శకుడితో పవన్ కల్యాణ్!

Pavan in Sudheer Varma Movie

  • షూటింగు దశలో 'హరి హర వీరమల్లు'
  • సెట్స్ పైకి వెళ్లనున్న 'భవదీయుడు భగత్ సింగ్'
  • తదుపరి సినిమా సురేందర్ రెడ్డితో 
  • సుధీర్ వర్మకి కూడా గ్రీన్ సిగ్నల్

పవన్ కల్యాణ్ ఆ మధ్య వరుస సినిమాలను ఒప్పేసుకున్నారు. ఆ సినిమాల్లో 'వకీల్ సాబ్' .. 'భీమ్లా నాయక్' మాత్రమే థియేటర్స్ కి వచ్చాయి. 'హరి హర వీరమల్లు' సెట్స్ పై ఉండగా, 'భవదీయుడు భగత్ సింగ్' సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. ఇక ఆ తరువాత లైన్లో  సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడనే విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో పవన్ మరో మూడు రీమేకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ రెండు మూడు రోజులుగా బలంగా వినిపిస్తోంది. ఒక రీమేక్ కి సముద్రఖని దర్శకత్వం వహించనుండగా, మరో రీమేక్ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలవుతున్నాయని చెబుతున్నారు. 

'స్వామిరారా' సినిమాతో హిట్ అందుకున్న సుధీర్ వర్మ, ఆ తరువాత 'దోచేయ్' .. 'కేశవ' .. 'రణరంగం' సినిమాలు చేశాడు. అయితే అవి అంతగా ఆడలేదు. ప్రస్తుతం ఆయన రవితేజతో 'రావణాసుర' సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆయన పవన్ తోనే సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు.

Pavan Kalyan
Sudheee Varma
Raviteja
Ravanasura Movie
  • Loading...

More Telugu News