Car: తిరుమల ఘాట్ రోడ్డులో అగ్నికి ఆహుతైన కారు... వీడియో ఇదిగో!

Car caught in fire at Tirumala second ghat road

  • కర్నూలు భక్తులు కొండపైకి వెళుతుండగా ఘటన
  • ఆఖరి మలుపు వద్ద కారులో మంటలు
  • కారు దిగి పరుగులు తీసిన భక్తులు
  • మంటలు ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ కారు అగ్నికి ఆహుతైంది. కర్నూలుకు చెందిన భక్తులు కారులో తిరుమల కొండపైకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రెండో ఘాట్ రోడ్డు ఆఖరి మలుపు వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ ముందు భాగంలో మొదలైన మంటలు కొద్దిసేపట్లోనే కారంతా వ్యాపించాయి. 

అయితే, భక్తులు వెంటనే కారు దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, టీటీడీ అధికారులు వెంటనే స్పందించారు. మంటలను ఆర్పివేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News