Australia: ఎట్టకేలకు భారతీయ ప్రేయసిని పెళ్లాడిన గ్లెన్ మ్యాక్స్ వెల్

Maxwell Finally Married To His Indian Girlfriend
  • కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నిన్న వివాహం
  • 2020 ఫిబ్రవరిలో నిశ్చితార్థం
  • కరోనాతో వాయిదా పడుతూ వచ్చిన పెళ్లి
  • ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఆర్సీబీ
భారతీయ యువతి, తన ప్రేయసిని ఆస్ట్రేలియా బిగ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎట్టకేలకు వివాహమాడాడు. నిన్న కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అతడు పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన వినీ రామన్ తో ప్రేమలో ఉన్న అతడు.. 2020 ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకున్నా.. కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఇన్నాళ్లకు వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. 

వారి పెళ్లికి సంబంధించిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. మిస్టర్ అండ్ మిసెస్ అంటూ వినీరామన్ ఫొటోకు కామెంట్ పెట్టింది. కాగా, వారికి క్రికెట్ ఆస్ట్రేలియా, పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త జంటకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సరికొత్తగా శుభాకాంక్షలను తెలిపింది. ఐపీఎల్ లో అతడు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

‘‘మ్యాక్సీ, వినీ రామన్ లు వారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా శాంతి, సౌభాగ్య, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం’’ అంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఆర్సీబీ టీమ్ మేట్ చహల్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. కాగా, తమిళనాడుకు చెందిన వినీ రామన్.. ఆస్ట్రేలియాలో ఫార్మాసిస్ట్ గా పనిచేస్తోంది. అక్కడే మ్యాక్స్ వెల్ తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
Australia
Cricket
Glen Maxwell
Vini Raman

More Telugu News