Prabhas: సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్.. ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు?

Prabhas undergone surgery in Spain

  • 'సలార్' షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్
  • స్పెయిన్ లోని బార్సిలోనాలో చికిత్స
  • తదుపరి చెకప్ వరకు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలన్న డాక్టర్లు

పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తాజా చిత్రం 'రాధే శ్యామ్'కు మిశ్రమ స్పందన లభించింది. ఒక కేటగిరీ ఆడియెన్స్ ను మాత్రమే ఈ సినిమా మెప్పించగలిగింది. ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ తో ఈ సినిమా ఓ మోస్తరు వసూళ్లను రాబట్టింది. మరోవైపు, ప్రభాస్ ప్రస్తుతం స్పెయిన్ కు వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే, ఆయన వెళ్లింది వెకేషన్ కు కాదు. ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం ఆయన స్పెయిన్ కు వెళ్లారని చెపుతున్నారు. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'సలార్'లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ గాయపడ్డాడట. ఈ గాయానికి స్పెయిన్ లోని బార్సిలోనాలో ప్రభాస్ చికిత్స తీసుకుంటున్నాడట. ప్రభాస్ కు వైద్యులు చిన్నపాటి ఆపరేషన్ నిర్వహించారని తెలుస్తోంది. తదుపరి చెకప్ వరకు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. 

ప్రభాస్ ఆపరేషన్ వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కే', 'స్పిరిట్' సినిమాలలో నటిస్తున్న ప్రభాస్.. దర్శకుడు మారుతి తెరకెక్కించబోయే మరో చిత్రంలో కూడా నటించనున్నాడు.

  • Loading...

More Telugu News