Gretta Vedler: పుతిన్ ను విమర్శించిన మోడల్ శవమై కనిపించింది!

Model Gretta Vedler dead body found in a suitcase
  • 2021లో కనిపించకుండా పోయిన గ్రెట్టా
  • ఓ సూట్ కేసులో మృతదేహం గుర్తింపు
  • మాజీ బాయ్ ఫ్రెండే హంతకుడు
  • అసూయతోనే హత్య
ఉక్రెయిన్ పై దండెత్తాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యన్లలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. రష్యాలోని అనేక నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. రష్యా మీడియాలోని ఓ వర్గం కూడా పుతిన్ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. 

కాగా, పుతిన్ పై ఇటీవల అదేపనిగా విమర్శలు కురిపించిన రష్యన్ మోడల్ భామ గ్రెట్టా వెడ్లెర్ (23) శవమై కనిపించింది. ఆమె మృతదేహాన్ని ఓ సూట్ కేసులో గుర్తించారు. గ్రెట్టాను తానే చంపినట్టు మాజీ బాయ్ ఫ్రెండ్ దిమిత్రీ కోరోవిన్ అంగీకరించాడు. 

గ్రెట్టా కనిపించడం లేదంటూ 2021లో కేసు నమోదైంది. కాగా, పుతిన్ ను 'సైకో' అంటూ గ్రెట్టా అప్పట్లో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. అయితే, పుతిన్ పై వ్యాఖ్యలకు, ఆమె హత్యకు సంబంధంలేదని రష్యన్ మీడియా చెబుతోంది. మాజీ బాయ్ ఫ్రెండ్ అసూయతోనే గ్రెట్టాను అంతమొందించాడని మీడియా కథనాల్లో పేర్కొన్నారు. 

ఓ హోటల్ గదిలో గ్రెట్టాను చంపిన దిమిత్రీ ఆమె మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కుక్కి ఓ కారులో వదిలేశాడు. ఏడాది తర్వాత ఆమె మృతదేహాన్ని గుర్తించడంతో హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
.
Gretta Vedler
Death
Suitcase
Vladimir Putin
Russia

More Telugu News