AAP: పంజాబ్ కొత్త సీఎం దూకుడు.. రైతులకు 101 కోట్ల పరిహారం ప్రకటన
![punhab gevernment annonces 101crores compensation to cotton farmers](https://imgd.ap7am.com/thumbnail/cr-20220318tn623475fc9d4d0.jpg)
- తెగులుతో పత్తి పంటకు తీవ్ర నష్టం
- రైతులకు పరిహారం ఇవ్వాలని మాన్ నిర్ణయం
- రూ.101 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం
రికార్డు మెజారిటీతో పంజాబ్ పాలనా పగ్గాలు చేపట్టిన ఆప్ నేత భగవంత్ మాన్ తనదైన శైలి నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ నెంబరును ప్రకటిస్తానని చెప్పిన మాన్.. తాజాగా శుక్రవారం రైతుల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెగులు కారణంగా పత్తి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకునే దిశగా మాన్ పరిహారాన్ని ప్రకటించారు. పంట నష్టపోయిన పత్తి రైతులకు రూ.101 కోట్లకు పైగా పరిహారాన్ని అందజేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు.