rtc: తెలంగాణలోని 'పల్లె వెలుగు' బస్సుల్లో టికెట్ ఛార్జీల రౌండప్
- చిల్లర సమస్యను పరిష్కరించడానికి చర్యలు
- రూ.12 ఛార్జీ ఉన్న టికెట్ ధర రూ.10గా రౌండప్
- రూ. 13, రూ.14 ఉన్న ఛార్జీ రూ.15 పెంపు
- రూ.67గా ఉన్న ఛార్జీ ఇప్పుడు రూ.65
పల్లె వెలుగు బస్సుల్లో టికెట్ ఛార్జీలను రౌండప్ చేస్తూ టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో తలెత్తుతోన్న చిల్లర సమస్యను పరిష్కరించడానికి నేటి నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. పల్లె వెలుగు బస్సుల్లో రూ.12 ఛార్జీ ఉన్న టికెట్ ధరను రూ.10గా, రూ. 13, రూ.14 ఉన్న ఛార్జీని రూ.15గా రౌండప్ చేశారు.
అలాగే, 80 కిలోమీటర్ల దూరానికి రూ.67గా ఉన్న ఛార్జీని రూ.65గా చేశారు. చిల్లర సమస్య కారణంగా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఛార్జీల రౌండప్‌ను టీఎస్ ఆర్టీసీ రెండేళ్ల క్రితమే అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.