holi: హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రముఖులు.. వీడియోలు ఇవిగో

- రంగులు చల్లుతూ సంబరాలు
- దేశ ప్రజలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
- హోలీ జరుపుకున్న జవాన్లు
దేశ వ్యాప్తంగా నేడు హోలీ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపారు. పలు చోట్ల గత రాత్రి హోలికా దహనం కార్యక్రమం నిర్వహించారు. హోలీ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తన ఇంటి వద్ద సచిన్ హోలీ పండుగలో పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఇంటి వద్ద హోలీ సంబరాలు జరుపుకున్నారు.



కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ డెహ్రాడూన్‌లో హోలీ సందర్భంగా డోలు వాయించారు.