MS Dhoni: నా జెర్సీ నెంబరు వెనుక ఎలాంటి మూఢనమ్మకం లేదు... అసలు కారణం ఇదే: ధోనీ

Dhoni explains reason behind his jersey number

  • ధోనీ జెర్సీపై 7 నెంబరు
  • 2007 నుంచి అదే కొనసాగిస్తున్న ధోనీ
  • ఫార్మాట్ ఏదైనా మార్పు లేని ధోనీ నెంబరు
  • 7 తన పుట్టినరోజు అని వెల్లడి

భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచిపోతాడు. టీమిండియాకు టీ20, వన్డే వరల్డ్ కప్ లు అందించడమే కాదు, టెస్టుల్లోనూ జట్టును అగ్రస్థానానికి చేర్చాడు. అయితే, ధోనీ కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు జెర్సీ నెంబరు.7నే కొనసాగిస్తున్నాడు. ఆ నెంబరుతో ధోనీకి అవినాభావ సంబంధం ఏర్పడింది. 

మరికొన్నిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా, చెన్నై సూపర్ కింగ్స్ మాతృసంస్థ ఇండియా సిమెంట్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధోనీ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన జెర్సీ నెం.7 వెనుక ఎలాంటి మూఢనమ్మకంలేదని స్పష్టం చేశాడు. చాలామంది 7 అనే అంకెను తమ లక్కీ నెంబరుగా చెబుతుంటారని వెల్లడించాడు. 

అయితే తాను 7 అనే నెంబరు ఉన్న జెర్సీని ధరించడంపై వివరణ ఇస్తూ... తాను పుట్టింది జులై 7న అని తెలిపాడు. ఏడవ నెల, ఏడవ తేదీ... అంతకుమించి మరే కారణమూ లేదని ధోనీ అసలు సంగతి చెప్పాడు. "పైగా నేను పుట్టిన సంవత్సరం కూడా 81. 8 లోంచి 1 పోతే వచ్చేది 7. ఎటు చూసినా ఏడే"  అని వివిరించాడు. 

పుట్టిన తేదీ కంటే మంచి నెంబరు ఇంకేముంటుందన్న ఉద్దేశం కూడా తన నిర్ణయానికి కారణం అని వెల్లడించాడు. "అయితే చాలామంది 7 అనేది తటస్థ అంకె అని, దాంతో ఎలాంటి ఉపయోగం ఉండదని, అదే సమయంలో ఎలాంటి వ్యతిరేక ప్రభావం చూపదని చెప్పారు. నాకు నచ్చింది కూడా అదే. నా ఎంపికలో ఎలాంటి మూఢనమ్మకం లేదనే భావిస్తాను. 7 అనే అంకె నా హృదయానికి దగ్గరగా ఉంది కాబట్టే దాన్ని జెర్సీపై ధరిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా ఇది కొనసాగుతోంది" అని వివరించాడు.

MS Dhoni
Jersey Number
Team India
CSK
IPL
Cricket
  • Loading...

More Telugu News