UPSC: సివిల్స్ మెయిన్స్ ఫ‌లితాల విడుద‌ల‌.. ఇంట‌ర్వ్యూల‌కు 1,823 మంది ఎంపిక‌

civils mains results out

  • ఏప్రిల్ 5 నుంచి ఇంట‌ర్వ్యూలు
  • ఇంట‌ర్వ్యూలు ముగియ‌గానే తుది ఫ‌లితాలు
  • యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్రకటన  

అఖిల భార‌త స‌ర్వీసు అధికారుల ఎంపిక కోసం నిర్వ‌హించే సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల్లో భాగంగా మెయిన్స్‌కు సంబంధించిన ఫ‌లితాలు గురువారం సాయంత్రం విడుద‌ల‌య్యాయి. యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఈ ఫ‌లితాల‌ను కాసేప‌టి క్రితం విడుద‌ల చేసింది. ఈ పరీక్ష‌లో మెరిట్ సాధించిన అభ్య‌ర్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ వంటి ప‌లు స‌ర్వీసు అధికారులుగా ఎంపిక అవుతారు. 

సివిల్ స‌ర్వీసెస్-2021లో భాగంగా ప్రిలిమ్స్‌లో మెరిట్ సాధించిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మెయిన్స్ ఫ‌లితాలు కూడా విడుద‌లైపోగా.. ఈ ప్రక్రియ‌లో తుది అంక‌మైన ఇంట‌ర్వ్యూల‌కు 1,823 మంది ఎంపికైన‌ట్లుగా యూపీఎస్సీ ప్ర‌క‌టించింది. వీరికి ఏప్రిల్ 5 నుంచి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు యూపీఎస్సీ వెల్ల‌డించింది.

  • Loading...

More Telugu News