Raghu Rama Krishna Raju: కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్‌సింగ్‌తో ర‌ఘురామకృష్ణరాజు భేటీ

ysrcp rebel mp met union minister hardeep singh puri

  • పెట్రోలియం శాఖ మంత్రితో ర‌ఘురామ‌రాజు భేటీ
  • అమ‌రావ‌తిలో బీపీసీఎల్ భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని విన‌తి
  • ప‌లు కేంద్ర సంస్థ‌ల భ‌వ‌నాల నిర్మాణానికి విన‌తి

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు నేడు కేంద్ర మంత్రి హ‌ర్ దీప్ సింగ్ పురితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ మేర‌కు అటు ర‌ఘురామ‌రాజుతో పాటుగా ఇటు కేంద్ర మంత్రి కూడా ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న హ‌ర్ దీప్ సింగ్ పురిని ఆయ‌న కార్యాల‌యంలో క‌లిసిన ర‌ఘురామ‌రాజు ఏపీకి సంబంధించిన ప‌లు విన‌తుల‌ను అంద‌జేశారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావతిలో బీపీసీఎల్‌, హెచ్ఓసీఎల్‌, గెయిల్‌, సీపీడ‌బ్ల్యూడీ భ‌వ‌నాల నిర్మాణాన్ని త‌క్ష‌ణ‌మే మొద‌లుపెట్టాల‌ని ర‌ఘురామ‌రాజు కోరారు. ఈ మేర‌కు ఆయ‌న కేంద్ర మంత్రికి ఓ విన‌తి ప‌త్రం కూడా స‌మ‌ర్పించారు. త‌న విన‌తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించార‌ని ర‌ఘురామ‌రాజు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News